కార్మిక వాడల్లో ఎగిరిన ఎరుపు రంగు జెండా..

– ఘనంగా 138 మేడే దినోత్సవం 
నవతెలంగాణ – తంగళ్ళపల్లి
కార్మిక వాడల్లో ఎరుపు రంగు జెండా రెపరెపలాడింది. బుధవారం 138వ నేడే దినోత్సవ వేడుకలను తంగళ్ళపల్లి మండల కేంద్రంలో సీఐటీయూ, సీపీఐ(ఎం), సీపీఐ నాయకులు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయం ముందు ఎరుపు రంగు జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ… కార్మికుల హక్కుల కోసం పోరాడి అమరులైన వారిని స్మరించుకుంటూ వారికి విప్లవ జోహార్లు అందించారు. రానున్న రోజుల్లో కార్మిక చట్టాల హక్కుల పరిరక్షణ కోసం కార్మిక వర్గం ఐక్యంగా ముందుకు సాగాలని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ, మండల అధ్యక్షులు కుడికెల కనకయ్య, గ్రామపంచాయతీ కార్మికుల మండల అధ్యక్షులు బుర్ర శ్రీనివాస్ గౌడ్, ప్రధాన కార్యదర్శి కృష్ణవేణి, గోనె పరశురాములు, కూచన శంకర్ నాయకులు పాల్గొన్నారు.