భువనగిరి కోటలో ఎర్రజెండ ఎగరాలి..

నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
ఎర్రజెండా ముద్దుబిడ్డ కామ్రేడ్ ఎండి జాంగీర్ గెలుపు కోసం చిన్నకొండూరు గ్రామంలో ఆదివారం ఇంటింటి ప్రచారం చేస్తూ బడుగు బలహీన వర్గాల  ఆశాజ్యోతి  భువనగిరి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి ఎండి జాంగీర్ ని గెలిపించాలని కోరుతూ ప్రతి ఓటరులను కలిసి ప్రచారం నిర్వహించారు. భువనగిరి నియోజకవర్గంలో ప్రతినిత్యం ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఎండి జాంగీర్ ని ఓటుు వేసి గెలిపించాలని అన్నారు. ప్రశ్నించే గొంతుకను పార్లమెంటుకు పంపాలని కోరడమైనది పది సంవత్సరాలు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కొత్తగా ఎన్నికల్లో మేనిఫెస్టోను పెట్టి ప్రజలను మోసం చేస్తున్నటువంటి బీజేపీని ఓడించాలని చెప్పడం జరిగింది. ప్రభుత్వ రంగాలన్నీ ప్రైవేటుపరం చేస్తూ దేశాన్ని దివాల తీసినటువంటి మతతత్వ పార్టీలను ఓడించాలని కోరారు. గ్రామాలలో కార్మికుల వలస పోకుండా ఉపాధి పథకాన్ని గతంలో పార్లమెంటులో వాపక్ష పార్టీలు చట్టం తీసుకొచ్చి అమలు చేయించి ఘనత సాధించారని ఓటర్లను వివరించారు. ప్రజా సంక్షేమలను అమలు చేయకుండా ఎన్నో వాగ్దానాలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్నటువంటి బిజెపిని ఎన్నికలలో  ఓడించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో చిన్నకొండూరు శాఖ కార్యదర్శి ఆదిమూలం నందీశ్వర్ సీపీఐ(ఎం) పార్టీ నాయకులు రాములు, చింతపల్లి నరసింహారెడ్డి,మాండ్ర కోటయ్య,  గడగొట్టి జంగయ్య,తూర్పునూరి జంగయ్య,బక్క యాదయ్య,ఎస్ కే ఇబ్రహీం,ఘర్ష నరసింహ, చెరుకు లక్ష్మమ్మ,భద్రమ్మ,పద్మ,భారతమ్మ, బాలమ్మ,పగడాల లక్ష్మమ్మ,యాదయ్య బొందయ్య,బుచ్చమ్మ మేడ్చల్ సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చింతల యాదయ్య బృందం మహిళా సంఘం కార్యకర్తలు పిఎన్ఎం కళాకారులు తదితరులు పాల్గొన్నారు.