కలకొండ ఫిలిమ్స్ బ్యానర్ పై ఆకుల రాఘవ దర్శకత్వంలో కలకొండ హేమలత నిర్మిస్తున్న చిత్రం ‘మన కుటుంబం’. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ చిత్రం అనుబంధాలు, అనురాగాలు, తెలంగాణ సాంప్రదాయాలకు ప్రతిబింబంగా నిలువనుంది. ఈ చిత్ర ఆడియో విడుదల సోమవారం అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఆడియోను సుమన్, అన్నపూర్ణమ్మ, సంగీత దర్శకుడు భానుప్రసాద్, దర్శకుడు ఆకుల రాఘవ, కలకొండ నరసింహ చేతుల మీదుగా విడుదల చేశారు. ‘ఇందులోని పాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి. సంగీత దర్శకుడు జె. భానుప్రసాద్ చాలా బాగా కంపోజ్ చేశారు. వందేమాతరం శ్రీనివాస్, నల్లగొండ గద్దర్, రోహిణి, సింధుజ శ్రీనివాస్, మారుతి అద్భుతంగా గానం చేశారు. పాటలే కాదు సినిమా సైతం ప్రేక్షకుల్ని కచ్చితంగా అలరిస్తుంది’ అని సుమన్ తెలిపారు. నిర్మాత కలకొండ హేమలత మాట్లాడుతూ,’ఈ చిత్రంలోని పాటలు ఉదరు కిరణ్ యూట్యూబ్ ఛానల్‌లో రానున్నాయి. మీరందరూ పాటలను చూసి అందరికీ షేర్ చేయాలని కోరుకుంటున్నా. ఓ మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం’ అని అన్నారు. త్వరలోనే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసి, విడుదల చేస్తామని దర్శకుడు ఆకుల రాఘవ తెలిపారు. ఈ సినిమా అందర్నీ మెప్పింస్తుందనే ఆశాభావాన్ని ఈ వేడుకకు విచ్చేసిన అతిథులు ఆకాంక్షించారు.
అనుబంధాలకు ప్రతిబింబం
11:09 pm