జాలర్ల జీవితానికి ప్రతిబింబం

A reflection on the life of fishermenకీర్తన ప్రొడక్షన్స్‌ పతా కంపై రమాకాంత్‌, అవంతిక, భానుశ్రీ హీరో, హీరోయిన్లుగా నగేష్‌ నారదాసి దర్శకత్వంలో బధావత్‌ కిషన్‌ నిర్మిస్తున్న యాక్షన్‌ ఎంటర్టైనర్‌ ‘సముద్రుడు’.
ఈ చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను మేకర్స్‌ ఘనంగా నిర్వహిం చారు. ఈ వేడుకలో ముఖ్య అతిథులుగా దర్శకుడు వి. సముద్ర, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ సెక్రటరీ టి.ప్రసన్నకుమార్‌ పాల్గొన్నారు. నిర్మాత కీర్తన మాట్లాడుతూ, ‘మా సినిమా కలెక్షన్లలో 20శాతాన్ని మత్స్యకారులకు అందజేస్తాం’ అని అన్నారు. ‘ఈ సినిమా జాలర్ల జీవితాలపై ఒక డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో దర్శకుడు నగేష్‌ చాలా బాగా తీశాడు’ అని హీరో సుమన్‌ చెప్పారు. హీరోయిన్‌ అవంతిక మాట్లాడుతూ, ‘ఈ సినిమాలో నేను టీచర్‌ క్యారెక్టర్‌లో నటించాను’ అని అన్నారు. హీరో రమాకాంత్‌ మాట్లాడుతూ, ”ఛత్రపతి’ ఎంత పెద్ద విజయం సాధించిందో ఈ సినిమా కూడా అంతే విజయం సాధిస్తుంది అని నమ్ముతున్నాను. ఈనెల 25న ప్రేక్షకులు అందరూ థియేటర్లకి వచ్చి సినిమా చూస్తారని ఆశిస్తున్నాను’ అని తెలిపారు. ‘జాలర్లు సముద్రంలోకి చేపల వేటకు వెళ్ళినప్పుడు పడే కష్టాలు, వాళ్లకు వచ్చే సమస్యల్ని ఈ చిత్రంలో చూపించాం’ అని దర్శకుడు నగేష్‌ నారదాసి చెప్పారు.