కీర్తన ప్రొడక్షన్స్ పతాకంపై రమాకాంత్, అవంతిక, భానుశ్రీ హీరో, హీరోయిన్లుగా నగేష్ నారదాసి దర్శకత్వంలో బదావత్ కిషన్ నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘సముద్రుడు’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి కేటీఆర్ గురువారం చిత్ర ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు నగేష్ నారాదాసి మాట్లాడుతూ, ‘మత్స్యకారుల జీవితాలను ప్రతిబింబిస్తూ రూపొందించిన చిత్రమిది. పెద్ద ఆర్టిస్టులు అందరూ నటించారు. ఒక సోషియో ఎలిమెంట్‌ని కమర్షియల్‌గా మలిచి సినిమాగా రూపొందించడం అభినందనీయమని టీజర్‌ను ఆవిష్కరించిన కేటీఆర్ ప్రశంసించడం సంతోషంగా ఉంది’ అని అన్నారు. ‘అన్ని కమర్షియల్ హంగులతో మా చిత్రాన్ని మే 3వ తేదీన రిలీజ్ చేస్తున్నాం. అందరూ చూసి విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాం’ అని హీరో రమాకాంత్ చెప్పారు. సుమన్, శ్రవణ్, రామరాజు, రాజ్ ప్రేమి, సమ్మెట గాంధీ, ప్రభావతి, జబర్దస్త్ శేష్, చిత్రం శ్రీను తదితరులు నటిస్తున్నారు.