మత్య్సకారుల జీవితాలకు ప్రతిబింబం

A reflection on the lives of fishermenకీర్తన ప్రొడక్షన్స్‌ పతాకంపై రమాకాంత్‌, అవంతిక, భానుశ్రీ హీరో హీరోయిన్లుగా నగేష్‌ నారదాసి దర్శకత్వంలో బధా వత్‌ కిషన్‌ నిర్మిస్తున్న యాక్షన్‌ ఎంటర్టైనర్‌ ‘సముద్రుడు’. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్‌ గురువారం ట్రైలర్‌ విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో తలకోన ప్రొడ్యూసర్‌ శ్రీధర్‌ రెడ్డి, దర్శకుల సంఘం అధ్యక్షులు వీర శంకర్‌, డైరెక్టర్స్‌ సముద్ర, నిర్మాతలు రామ సత్యనారాయణ, ముత్యాల రాందాస్‌, పీపుల్‌ మీడియా ఎగిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ కాసుల శ్రీధర్‌, చిత్ర కో ప్రొడ్యూసర్స్‌ జ్ఞానేశ్వర్‌, సొములు, చిత్ర నిర్మాత కీర్తన తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు నగేష్‌ నారదాసి మాట్లాడుతూ ‘మత్య్సకారుల జీవితాలను ప్రతిబింబిస్తూ రూపొందించిన చిత్రమిది. సముద్రమే వారి జీవనాధారం. అలాంటి సముద్రంలోకి వారు వెళ్లకుండా ప్రభుత్వం ఆంక్షలు విధించే పరిస్థితుల్లో వారి జీవన పోరాటం, వారి మనో వేదనే ఈ చిత్రం’ అని తెలిపారు.