ఆకాష్ మురళి, అదితి శంకర్(డైరెక్టర్ శంకర్ కుమార్తె) జంటగా ‘పంజా’ఫేం విష్ణు వర్ధన్ తెరకెక్కించిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ప్రేమిస్తావా’. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా తమిళంలో ‘నేసిప్పాయా’ పేరుతో విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ‘ప్రేమిస్తావా’ అనే టైటిల్‌తో జనవరి 31న తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేశారు. తెలుగులో సైతం ఈ సినిమా అందరినీ అలరించి సూపర్ హిట్ అందుకుని, సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది.
ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్‌మీట్‌లో హీరో ఆకాష్ మురళి మాట్లాడుతూ,’ తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. నన్ను తెలుగు ఇండిస్టీలోకి ఎంతో ప్రేమతో వెల్‌కమ్ చేయడం ఆనందంగా ఉంది. చాలా మంది ప్రేక్షకులు ఇది నా డెబ్యు సినిమాలా అనిపించడం లేదని చెప్పడం గొప్ప కాంప్లిమెంట్‌గా భావిస్తున్నాను. సినిమాకి మంచి స్పందన లభిస్తోంది. ఇంత ప్రేమని అందించిన ప్రేక్షకులకు థ్యాంక్స్. ఇందులో లవ్ స్టోరీ అందరూ రిలేట్ చేసుకునేలా ఉందనే ప్రశంసలు వస్తున్నాయి’ అని తెలిపారు.
‘తెలుగులోనూ ఈ సినిమా చాలా అద్భుతంగా రీచ్ అయ్యింది. స్క్రీన్స్ పెరుగుతున్నాయని మైత్రీ వారు చెప్పడం చాలా ఆనందంగా అనిపించింది’ అని డైరెక్టర్ విష్ణు వర్ధన్ చెప్పారు. నిర్మాత స్నేహ మాట్లాడుతూ, ‘సినిమాకి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మంచి రివ్యూలు వచ్చాయి. తమిళంతోపాటు తెలుగులోనూ ఈ సినిమా మంచి ఆదరణ పొందడం చాలా ఆనందంగా ఉంది’ అని అన్నారు.