ప్రవళిక ఆత్మహత్య ఘటనపై 48 గంటల్లో నివేదిక సమర్పించాలి

–  సీఎస్‌, డీజీపీలను కోరిన గవర్నర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ప్రవళిక ఆత్మహత్య ఘటనపై 48 గంటల్లో నివేదిక సమర్పించాలని రాష్ట్ర గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందర రాజన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో పాటు డీజీపీని కోరారు. ప్రవళిక మరణం పట్ల గవర్నర్‌ సంతాపం తెలిపారు. ఆమె కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు. నమ్మకాన్ని కోల్పోవద్దనీ, ధైర్యాన్ని ప్రదర్శించాలని ఉద్యోగ అశావహులకు ఆమె సూచించారు.