
మండలంలోని రామేశ్వర్ పల్లి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న విద్యుత్ సబ్ స్టేషన్ కొరకు 33 కెవి విద్యుత్ లైన్ ఇంటి స్థలాలు, ఇంటి పైనుండి వెళుతున్న కారణంగా భవిష్యత్తులో విద్యుత్ లైన్ ద్వారా ప్రమాదం సంభవించే అవకాశం ఉందని, విద్యుత్ అధికారులు స్పందించి 33 కెవి విద్యుత్ లైన్ ను మరోచోటి నుండి తీసుకెళ్లాలని గ్రామ బాధితులు విద్యుత్ అధికారులకు వినతి పత్రం అందజేశారు.