దయ్యాల బోడుకు బీటీ రోడ్డు నిర్మించాలని వినతి

నవతెలంగాణ-ఆమనగల్‌
మండలంలోని శంకర్‌ కొండ తాండా గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న దయ్యాల బోడు తాండాకు బీటీ రోడ్డు నిర్మించాలని కోరుతూ వార్డు సభ్యులు రాజు నాయక్‌తో కలిసి తాండా యువకులు పలువురు శనివారం ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి వినతి పత్రం అందజేశారు. కత్వా వాగు వంతెన నుంచి సుమారు 500 మీటర్ల దూరంలో ఉన్న దయ్యాల బోడు తాండా వాసులు వర్షాకాలంలో రాకపోకలకు పడుతున్న ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని బీటీ రోడ్డు మంజూరు చేయాలని వారు ఎమ్మెల్యేను వేడుకున్నారు. ఈ విషయమై ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి బీటీ రోడ్డు నిర్మించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చినట్టు వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో కేఎన్‌ఆర్‌ యువ సేన జిల్లా నాయకులు విజరు రాథోడ్‌, యువ నాయకులు రాజేష్‌, జైపాల్‌, వినోద్‌, రాజు తదితరులు పాల్గొన్నారు.