ప్రాథమికోన్నత పాఠశాలగా మార్చాలని వినతి

నవతెలంగాణ-బడంగ్‌పేట్‌
మహేశ్వరం నియోజకవర్గం జల్‌పల్లి మున్సిపల్‌ పరిధిలోని శ్రీరాం కాలనీలో ఉన్న ప్రాథమిక పాఠశాలను ప్రాథమికోన్నత పాఠ శాలగా మార్చాలని కోరుతూ కౌన్సిలర్లు కే.లక్ష్మి నారాయణ, పల్లపు శంకర్‌లు శుక్రవారం విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ ఎంతో కాలంగా ప్రాథమిక పాఠశాలగా కొనసాగుతుందని తెలిపారు. ఉన్నత చదువుల కోసం విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన మంత్రి పాఠశాల అప్గ్రేడ్‌ చేయాలని ఉన్నత అధికారులను ఆదేశించారని తెలిపారు. అనంతరం మంత్రికి కౌన్సిలర్లు ప్రత్యే కంగా కతజ్ఞతలు తెలిపారు.
బడంగ్‌పేట్‌ కేసీఆర్‌ నాయకత్వంలో ఆలయాల అభివృద్ధి
సీఎం కేసీఆర్‌ నాయ కత్వంలో దేవాలయాల అభి వృద్ధికి పేద్ద పీట వేస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గ దేవాలయాల అభివద్ధికి ఇప్పటికే రూ. 5 కోట్లు విడుదలయ్యాయని..మరో రూ.3 కోట్ల నిధులు మంజూరైనట్లు తెలిపారు. రెండు విడతలుగా మంజూరు అయిన సుమారు రూ.8 కోట్ల నిధులతో మహేశ్వరం నియోజకవర్గ పురాతన దేవాలయాలను అభివద్ధి చేయటం జరిగిందన్నారు. నియోజకవర్గంలోని 8 ప్రాచీన దేవాలయాల్లో కోట్ల రూపాయల నిధులతో మౌలిక సదుపాయాల కల్పన, ఇతర పనులు చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు.