
మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం వద్ద రెవెన్యూ ఇన్స్ పెక్టర్ షేపి కి బిజెపి మందలంకమిటి అధ్వర్యంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని గురువారం వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా మండల అధ్యక్షులు రామావత్ సురేష్ నాయక్ మాట్లాడుతు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన హామీలో బీసీలకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం, దళిత బంధు, డబుల్ బెడ్ రూం, రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ తక్షణమే అమలు చేయాలనీ డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గంగోని సంతోష్, ఓబీసీ మోర్చా అర్ముర్ అసెంబ్లీ కన్వీనర్ గంగోని వినోద్, రాజేందర్ రెడ్డి, ఎం. రాజేశ్వర్, శివలాల్, జిట్టా పెద్ద గంగారాం, సంజీవ్, శ్రీనాథ్, సిసింద్రీ, మహేష్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.