
అర్హులకు మాత్రమే ప్రభుత్వ పథకాలు అందాలని మండలంలోని కాచాపూర్ గ్రామ ప్రజలు తాసిల్దార్ శివప్రసాద్ కు శుక్రవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. గ్రామంలో మరోసారి ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డుల సర్వే చేయాలని, గత సర్వేలో అనుమానాలు ఉన్నాయని తెలిపారు. మరోసారి సర్వే చేసి అర్హులను గుర్తించి పేద ప్రజలకు, అర్హులైన వారికి న్యాయం చేయాలని వినతి పత్రంలో కోరినట్లు తెలిపారు.