చేగుంట నుంచి దుబ్బాక మీదుగా సిరిసిల్ల వరకు జాతీయ రహదారిని మంజూరు చేయించాలని కోరుతూ బుధవారం దుబ్బాక డెవలప్మెంట్ ఫోరం అధ్యక్షులు మాడబోయిన శ్రీకాంత్ ఆధ్వర్యంలో మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావును దుబ్బాకలో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. దుబ్బాక నియోజకవర్గ పరిధిలో అభివృద్ది,మెరుగైన రవాణా సౌకర్యం,వ్యాపార విస్తరణ కోసం జాతీయ రహదారి ఏర్పాటు ఆవశ్యకతను ఎంపీకి వివరించడం జరిగిందన్నారు. ఎంపీని కలిసిన వారిలో పద్మశాలి యువజన సంఘం ప్రతినిధులు చంద్రశేఖర్, రాజు, వెంకటేష్, బీజేపీ నాయకులు బాలరాజు, ఉపేందర్ పలువురు ఉన్నారు.