తెలంగాణ ఎరుకల సంఘం (కుర్రు) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఎరుకల నాంచారమ్మ జాతరకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ సోమవారం మాసబ్ ట్యాంక్ ట్రైబల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేసినట్లు యాదాద్రి జిల్లా అధ్యక్షులు కుతాడి సురేష్ తెలిపారు. భూదన్ పోచంపల్లి మండలం పిల్లాయిపల్లి గ్రామంలో నిర్వహించే ఎరుకల నాంచారమ్మ జాతరకు నిధులు మంజూరు చేయాలని కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకినీ రాజు ,రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కోనేటి నరసింహ, రాష్ట్ర ఉపాధ్యక్షులు రుద్రాక్ష నరసింహ, మందలాపురం గోపాల్ ,వనం రమేష్ ,రాయపురం వెంకటేశ్వర్లు, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు కుతడీ సురేష్ ,నారాయణపేట జిల్లా అధ్యక్షులు పాతపల్లి నరసింహులు పాల్గొన్నారు.