వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని వినతి

నవతెలంగాణ- నవీపేట్: ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టాలని ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుకు శుక్రవారం వినతిపత్రం అందించారు. బిజెపి అధికారంలోకి వస్తే 100 రోజుల్లో వర్గీకరణ బిల్లు పెడతామని చెప్పిన విషయాన్ని ఎమ్మార్పీఎస్ జిల్లా కమిటీ గుర్తు చేశారు. పార్లమెంటు సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మానికోళ్ళ గంగాధర్, ఆకారం రమేష్, మారుతి, ప్రవీణ్, సుమన్, యమునా, పద్మ తదితరులు పాల్గొన్నారు.