నవతెలంగాణ – జమ్మికుంట
జమ్మికుంట మున్సిపల్ పరిధిలో చేపడుతున్న అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని మున్సిపల్ కమీషనర్ కు సోమవారం పట్టణానికి చెందిన లోకిని తిరుపతి సోమవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
జమ్మికుంట మున్సిపల్ పరిధిలో మున్సిపల్ నిబంధనలు అతిక్రమించి అనేక మంది అక్రమ నిర్మానాలు చేపడుతున్నట్లు ఆయన ఆరోపించారు. ముఖ్యంగా మున్సిపల్ పరిధిలోని మోత్కూలగూడెం, అంబేడ్కర్ చౌరస్తా నుండి రైల్వే ట్రాక్ వరకు ఉన్న ఇళ్ళ నిర్మాణాలు, మున్సిపల్ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయని ఆరోపించారు. వెంటనే మున్సిపల్ అధికారులు వార్డులో సందర్శించి రోడ్డును అక్రమంగా ఆక్రమించి నిర్మాణం చేపట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.