
భిక్కనూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన వెంచర్ నిర్వాహకులు కళాశాల భూములను ఆక్రమిస్తున్నారని ఏబీవీపీ ఆధ్వర్యంలో శనివారం రెవెన్యూ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ కామారెడ్డి స్టూడెంట్ ఫర్ సేవా టౌన్ ప్రెసిడెంట్ సంజయ్ మాట్లాడుతూ పది ఎకరాలలో జూనియర్ కళాశాల ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రస్తుతం సమీపంలో వెలసిన వెంచర్ నిర్వహకులు కళాశాల భూములను ఆక్రమిస్తున్నారని రెవెన్యూ అధికారులు స్పందించి కళాశాల భూములను కాపాడాలని డిప్యూటీ తాసిల్దార్ రోజాకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు రాజేందర్, యోగేష్, ఆదర్శ్, సాయికుమార్, రాకేష్, తదితరులు పాల్గొన్నారు.