
ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతూ పి ఆర్ టి యు ఆధ్వర్యంలో తహసిల్దార్ వెంకటరమణకు సోమవారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా పిఆర్టియు జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి, మండల అధ్యక్షులు భూమయ్య మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం సిపిఎస్ స్థానంలో ఏకీకృత పెన్షన్ స్కీమ్ (యుపిఎస్)ను ప్రవేశపెట్టిందని కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని మేనిఫెస్టోలో ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ విషయమై భోజన విరామ సమయంలో ఎమ్మార్వోకు వినతిపత్రం అందించామని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించే తమ సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేట్ అధ్యక్షులు గోపిడి రవీందర్, మేక సుధాకర్ రెడ్డి, గంగోని శ్రీనివాస్ మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.