రైతాంగ సమస్యలు పరిష్కరించాలని వినతి

నవ తెలంగాణ – నవీపేట్
రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే పరిష్కరించాలని ఏఐపీకేఎస్ ఆధ్వర్యంలో ఎమ్మార్వో వీర్ సింగ్ కు సోమవారం వినతి పత్రం అందించారు.ఈ సందర్భంగా అఖిలభారత ప్రగతిశీల రైతు సంఘం బోధన్ డివిజన్ కార్యదర్శి రాజేశ్వర్ మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు తనకి సమస్యలతో సతమతమవుతున్నారని కౌలు రైతులకు గుర్తింపు కార్డు ఇచ్చి రుణ సౌకర్యం కల్పించాలని, స్వామినాథన్ సిఫారసులను అమలు చేయాలని, నకిలీ విత్తన వ్యాపారులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని, అన్ని పంటలకు భీమా వర్తింపజేయాలని, రభీ సీజన్లో నష్టపోయిన వాణిజ్య పంటలకు లక్ష రూపాయలు ఇతర పంటలకు 50 వేల రూపాయలు చెల్లించాలని, రుణమాఫీని ఏకకాలంలో చేసి నూతన రుణాలను ఇవ్వాలని, డిమాండ్ చేశారు. లేనియెడల సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐపీకేఎస్ జిల్లా ఉపాధ్యక్షులు నాగన్న, వడ్డెన్న తదితరులు ఉన్నారు.