గ్రామపంచాయతీ సిబ్బంది పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ తరపున మండల్ అధ్యక్షులు బొల్లపల్లి స్వామి కార్యదర్శి కుంసోత్ శంకర్ గడుగు నరసింహ ఆధ్వర్యంలో ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షురాలు గునుగుంట్ల కల్పన కి శనివారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 12769 గ్రామపంచాయతీలు ఉన్నవి. అందులో 52,000 మంది గ్రామపంచాయతీ ఉద్యోగులు కార్మికులు పనిచేస్తున్నారు. గ్రామాలలో పారిశుద్ధ్య కార్యక్రమం వీధిలైట్లు వాటర్ సప్లై వైకుంఠధామాలలో చెత్తాచెదారం తీసేయడం పనులు చేస్తూ ఉన్నారు. వీరిలో అత్యధికులు దళితులు బలహీన వర్గాల వారు పనిచేస్తున్నారు. నేటికీ పర్మినెంట్ కు నోచుకోలేక అతి తక్కువ జీతం తోటి పనిచేస్తున్నారు. వీరికి ఇన్సూరెన్స్ కూడా లేదు. రూ. 8000 జీతం తోటి ఈ కార్మికులు పనిచేస్తామన్నారు. కనీస వేతనం కూడా వీరికి ఇవ్వట్లేదు. కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం వీరిని ఆదుకొని వీరికి కనీస వేతనం ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగులకు ఏ విధంగా అయితే పీఆర్సీ పరిధిలోకి తెస్తారో వీరిని కూడా అదే నిజంగా తీసుకురావాలని, వీరిని అన్ని విధాల ఆదుకోవాలని ఆమె ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.