మత్స్య కార్మికులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని జిల్లా మత్స్య కార్మిక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు చెక్క వెంకటేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నేమైన వెంకటేశం శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతు కే జండగే కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మత్స్య కార్మికులకు ఉచితంగా చేతివలలు, వాహనాలు ఇచ్చి ఆదుకోవాలని, చెరువులని పూడిక లు మట్టి చెరువులను పెద్దగా చేయలని నూతన సొసైటీ సభ్యత్వం చేయాలని ఉచిత చేప పిల్లలు ఇవ్వాలని కొత్త సహకార సంఘాలు ఏర్పాటు చేయాలని కోరారు . సంఘములు సభ్యుడు చనిపోతే 20 లక్షల ఎక్స్గ్రేషియా, బ్యాంకు రుణాలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ రాష్ట్ర నాయకులు మొలగాని సత్యనారాయణ, కల్లెం కృష్ణ, మత్స్య జిల్లా అధ్యక్షులు ఈగల లింగం, సింగర్తి శంకర్, పుల్లూరి పద్మ, తుమ్మల జ్యోతి, సోమేశ్వరి, అంజయ్య, మల్లేష్ లు పాల్గొన్నారు .