నవతెలంగాణ – జక్రాన్ పల్లి
శివరాత్రి రోజున పోచంపాడు లక్ష్మీకాల్వలో గంగా స్థానానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయిన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయము అందజేయాలని సోమవారం జిల్లా కలెక్టర్కు స్థానిక ఎంపీటీసీ అంకం లక్ష్మి జయప్రకాష్, పుప్పాలపల్లి మాజీ సర్పంచ్ జయప్రకాష్ వినతిపత్రం సమర్పించారు. జక్రాన్ పల్లి మండలం గన్యాతాండ కు చెందిన ముగ్గురు యువకులు శివరాత్రి రోజున గంగ స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోవడం జరిగిందని, చనిపోయిన కుటుంబాలు కూలి పని చేసుకుని బతుకుతారని అత్యంత నిరుపేదలని వారి పట్ల కనికరించి ప్రభుత్వం ద్వారా తక్షణ ఆర్థిక సహాయము అందజేయాలని జిల్లా కలెక్టర్కు ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించారు.