ధరణి సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ కు వినతి

నవతెలంగాణ- నవీపేట్: మండలంలో ధరణి సమస్యలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే పరిష్కరించాలని జన చైతన్య వేదిక అధ్యక్షులు సంజీవ్ కలెక్టర్ కు సోమవారం వినతిపత్రం అందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో ధరణిలో డిజిటల్ సైన్, డేటా కరెక్షన్ లాంటి అనేక సమస్యలతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కారణంగా 180 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.ఈ కార్యక్రమంలో  అనంతరావు, అబ్బన్న, శోభన్ తదితరులు పాల్గొన్నారు.