ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ టీఎస్ యుటిఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డిఇఓ సత్యనారాయణకు మంగళవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ముక్కెర్ల యాదయ్య, మెతుకు సైదులు లు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు విధులు నిర్వర్టించిన ఉపాధ్యాయులకు సంపాధిత సెలవులు మంజూరీ చేయాలని, కులగనన చేసిన ఉపాధ్యాయులకు సెలవు రోజులకు గాను సీసీఎల్ మంజూరి చేయాలని, ఉపాధ్యాయుల సాధారణ బదిలీలు -2024 అధికార దుర్వినియోగం పాల్పడిన సంబంధిత విద్యాధికారులను తక్షణమే విధుల నుండి తొలిగించాలని, వారిపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్సులు కె రాజగోపాల్, జి వి రమణారావు, జిల్లా ఆడిట్ కమిటీ కన్వీనర్ జె కరుణాకర్, జిల్లా నాయకులు బండ నర్సిరెడ్డి, పి సుదర్శన్ రెడ్డి, రవీందర్ లు పాల్గొన్నారు.