ఆరు మండలాలు,92 రెవెన్యూ గ్రామాలతో దుబ్బాకను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని కోరుతూ దుబ్బాక డెవలప్మెంట్ ఫోరం అధ్యక్షులు మాడబోయిన శ్రీకాంత్ ఆధ్వర్యంలో శనివారం దుబ్బాక మండల పరిధిలోని సీఎస్ఆర్ క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర అటవీ,దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు వినతిపత్రం అందజేశారు.2016 లో జిల్లాల పునర్విభజనప్పుడే నూతన రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయడంలో దుబ్బాకకు అన్యాయం జరిగిందని గుర్తు చేశారు.ఈ ప్రాంతం అభివృద్ధిలో పూర్తిగా వెనుకబడిపోయిందని.. దుబ్బాక అభివృద్ధికి రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని మంత్రిని విజ్ఞప్తి చేశారు.డీడీఎఫ్ వర్కింగ్ ప్రెసిడెంట్ మర్గల రాజేష్ పలువురున్నారు.