నవతెలంగాణ-శేరిలింగంపల్లి
శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని గచ్చిబౌలి డివిజన్ నేతాజీనగర్ కాలనీలో రెండు మూడు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతమైన నేతాజీనగర్ కాలనీలో రోడ్లు నడవడానికి సైతం పనికిరానంతగా అధ్వానంగా తయారయ్యాయి. కాలనీలోని ప్రజలు నడవడానికి సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సందర్భంగా నేతాజీ నగర్ కాలనీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ కాలనీలోని రహదారుల స్థితిగతులపై స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి వివరిస్తూ ప్లాట్ నెంబర్ 316 నుంచి 386వరకు, 389 నుంచి 403 వరకు, 608 నుంచి 601వరకు, 563 నుంచి 576 వరకు, 536 నుంచి 547 వరకు, 286 నుంచి 302 వరకు గల రహదారులను మరమ్మతు చేయాలని సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ సానుకూలంగా స్పందిస్తూ త్వరలోనే కాలనీలోని అన్ని సమస్యలకు రహదారులు గాని, డ్రయినేజీ వ్యవస్థ గాని మంచినీటి వ్యవస్థ గాని పరిష్కారం అయ్యే దిశగా కషి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో నేతాజీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కే నరసింహ యాదవ్, సుభాష్ ముదిరాజ్ మరియు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు