ఇచ్చిన హామీలను  నెరవేర్చాలని ఎమ్మెల్యేకు వినతి

A request to the MLA to fulfill the promises givenనవతెలంగాణ – భీంగల్
తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 24 రోజులు సమ్మె చేయగా అప్పటి  బి ఆర్ ఎస్ ప్రభుత్వం  ఇచ్చిన హామీల మేరకు తమ తమ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు వేల్పూర్ లోని ఎమ్మెల్యే స్వగృహంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ అధ్యక్షరాలు దేవగంగు మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్ల నెరవేర్చాలని 24 రోజుల సమ్మేళ కూర్చుండగా దిగివచ్చిన అప్పటి ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చి ఇప్పటికి నెరవేర్చకపోవడం బాధాకరమన్నారు. కనుక ఇప్పటికైనా జీవో 10ని రద్దుచేసి, వేతనాలను పెంచి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందజేయాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. అంతకుముందు ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు ఎమ్మెల్యే ఇంటి ముందు బైఠాయించారు. ఈ కార్యక్రమంలో దేవగంగు, జ్యోతి, గంగా లక్ష్మి, ప్రమీల తదితరులు పాల్గొన్నారు.