
మండల కేంద్రంలోని సీహెచ్ సీ సిబ్బంది బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని నిజామాబాద్ లోని ఆయన నివాసంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని సీహెచ్ సీ వెనుక వైపున గల స్థలం కబ్జాలకు గురవుతుందని అలాగే పాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థలం సైతం కబ్జాకు గురైందని, సీహెచ్ సీ చుట్టూ ప్రహరీ గోడ ఏర్పాటు చేయాలని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ఆయన స్పందిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే స్థలాన్ని తన నిధుల నుండి ప్రహరీ గోడ ఏర్పాటు చేసి కాపాడుతానని స్థల విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారిని కావ్య, వైద్య సిబ్బంది వెంకటేష్, కిషన్, దేవేందర్, ప్రభాకర్ తదితరులు ఉన్నారు.