వాల్మీకి విగ్రహ ఏర్పాటుకు ఎమ్మెల్యేకు వినతి

నవతెలంగాణ : వనపర్తి
వనపర్తి మున్సిపల్‌ కార్యాలయంలో వధాగా పడి ఉన్న మహర్షి వాల్మీకి విగ్రహాన్ని వివేకానంద చౌరస్తాలో ఏర్పాటు చేయాలని కోరుతూ వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఎమ్మెల్యే మెఘా రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గత సర్కారులో జరిగిన పరిణామాలను ఎమ్మెల్యేకు సంఘం నాయకులు వివరించారు. గతంలో వాల్మీకి మహర్షి విగ్రహాన్ని కేడిఆర్‌ నగర్‌ లోని ఏనుగులబొంద పార్కులో ఏర్పాటు చేసుకుంటే అప్పటి మంత్రి నిరంజన్‌ రెడ్డి అసహనం వ్యక్తం చేస్తూ పోలీస్‌ బలగంతో విగ్రహాన్ని తొలగించి మున్సిపాలిటీ కార్యాలయంలో పడవేసినారు. అహంకార పూరిత వ్యవహారాలకు పూనుకొని బీసీ సామాజిక వర్గాలను అణిచివేయాలని కుట్ర కుతంత్రాలతో నియంతలా వ్యవహరించిన నిరంజన్‌ రెడ్డికి వాల్మీకి విగ్రహం ఏర్పాటు చేయాలని ఎన్నోసార్లు వాల్మీకులు వినతి పత్రం ఇచ్చామన్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో తరుణంలో వాల్మీకుల ఓట్ల కోసం మళ్లీ మహర్షి విగ్రహం గుర్తుకొచ్చి వివేకానంద చౌరస్తాలో వాల్మీకి విగ్రహం అని వాల్మీకులకు మోస పూరిత భూమి పూజ చేశారన్నారు. మాజీ మంత్రి బీసీల అగ్రహానికి గురై, ఎన్నికల సందర్భంగా గుణపాఠం చెప్పామన్నారు.
సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే మేఘా రెడ్డి
మాట్లాడుతూ ఎన్నికల కోడ్‌ ముగిసిన అనంతరం తానే దగ్గరుండి స్వయంగా వాల్మీకి మహర్షి విగ్రహాన్ని ప్రతిష్ట చేయడం జరుగుతుందని హామీ ఇచ్చారు. అలాగే ఏదైతే వాల్మీకుల ఎస్టీ రిజర్వేషన్‌ ఉందో కాంగ్రెస్‌ పార్టీ ఎస్టీ రిజర్వేషన్‌ కు కట్టుబడి ఉందని అన్నారు ఈ సందర్భంగా వాల్మీకి సంఘం సీనియర్‌ నాయకులు కాంగ్రెస్‌ నాయకులు బోయ మురళి, వాల్మీకి సంఘం ఉమ్మడి పాల మూరు జిల్లా కన్వీనర్‌ కాంగ్రెస్‌ నాయకులు మండ్ల దేవన్న నాయుడు, వాల్మీకి సంఘం జిల్లా నాయ కులు, నల్లబోతుల రవి నాయుడు, వెంకటేష్‌ నాయు డు, ఎద్దుల రవి నాయుడు, వాల్మీకి సంఘం పట్టణ కార్యదర్శి మండ్ల రాఘవేంద్ర, సింగోటం నాయుడు, విష్ణు నాయుడు, గణేష్‌, రవి, వాల్మీకి నాయకులు తదితరులు ఎమ్మెల్యేకు కతజ్ఞతలు తెలిపారు.