
మండలంలోని కల్వలపల్లి గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం సీపీఐ(ఎం) గ్రామ శాఖ ఆధ్వర్యంలో గ్రామ కార్యదర్శి కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) మండల కార్యదర్శి సాగర్ల మల్లేష్ మాట్లాడుతూ గ్రామంలో సేకరించిన చెత్తను డంపింగ్ యార్డ్ కు తరలించేందుకు లక్షల రూపాయలు ఖర్చు చేసి ఏర్పాటుచేసిన డంపింగ్ యార్డ్ లో చెత్తను పోయకుండా నల్ల చెరువులో చెత్తను పోయడం ఏంటని ప్రశ్నించారు..? నల్ల చెరువులో చెత్త పోయకుండా చూడాలని కార్యదర్శికి సూచించారు. గ్రామంలో డ్రైనేజీ సమస్య,అంతర్గత సీసీ రోడ్ల సమస్య తీవ్రంగా ఉందని అన్నారు . మురికి కాలువల నిర్మాణం లేకపోవడంతో వీధుల వెంటే మురికి నీరు ప్రవహిస్తుండడంతో మురికి నీటిలో దోమలు , ఈగలు వాలి గ్రామంలోని ప్రజలు అనారోగ్య బారిన పడుతున్నారని అన్నారు. ప్రమాదకరంగా ఇండ్ల మీదుగా ఉన్న 11 కెవి లైన్లను మార్చాలని డిమాండ్ చేశారు. కల్వలపల్లి గ్రామం నుండి గూడపూర్ వరకు బిటి రోడ్డు ,అప్పాజీపేట నుండి, కల్వలపల్లికి , కొత్తగూడెం నుండి కల్వలపల్లి వరకు బీటీ రోడ్డు ఏర్పాటు చేసేందుకు నిధులను కేటాయించాలని ప్రభుత్వాని కోరారు. లేని పక్షంలో గ్రామ ప్రజలతోని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ కార్యదర్శివంటే పాక అయోధ్య,మండల నాయకులు శివర్ల వీరమళ్ళు , అమరేందర్ రెడ్డి, యాదిరెడ్డి, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.