ముదిరాజుల సమస్యలు పరిష్కరించాలని తహసీల్దార్ కు వినతి

A request to the Tehsildar to solve the problems of Mudirajas

– ముదిరాజ్ సంఘం రాష్ట్ర కార్యదర్శి నీలం దుర్గేష్
నవతెలంగాణ – నెల్లికుదురు
ముదిరాజుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తాసిల్దారు కోడి చింతల రాజుకు ముదిరాజుల సంఘం మండల సంఘం సభ్యులతో కలిసి తహసీల్దార్ కోడి చింతల రాజుకు వినతిపత్రం అందించినట్లు ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి నీలం దుర్గేష్ మహబూబాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి గుండా వెంకన్న తెలిపారు. మండల కేంద్రంలోని ఆ సంఘం మండల అధ్యక్షుడు కుక్కల ఐలయ్య ఆధ్వర్యంలో స్థానిక విశ్రాంతి భవనం నుండి అంబేద్కర్ కూడలి వద్ద నుంచి ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయం వరకు వెళ్లి బుధవారం వినతి పత్రాన్ని అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ముదిరాజ్ లను BC D నుండి BC A లోకి మార్చాలని ముదిరాజ్ లకు, మత్స్య కారులకు రూ.1000 కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని 75 శాతం సబ్సిడీ తో సంక్షేమ పథకాలను అమలు చేయాలని  పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని  తహశీల్దార్ రాజుకు అందించే కార్యక్రమాన్ని నిర్వహించామని అన్నారు. ఈ కార్యక్రమంలో తోట రమేష్ శ్రీను యాకయ్య  బాద ఉప్పలయ్య జిల్లా ప్రచార కార్యదర్శి, జలక వీరన్న, మల్లయ్య,మంద అశోక్,తదీతరులు పాల్గొన్నారు.