
– 20 ఏళ్లుగా వ్యవసాయ కూలీగా పని చేస్తూ మృతి..
నవతెలంగాణ – బెజ్జంకి
మండల పరిధిలోని బేగంపేట గ్రామానికి చెందిన రాగి రవి(55) సౌదీలో ఈ నెల 14న అనారోగ్యంతో మృతి చెందినట్టు స్థానిక గల్ఫ్ కార్మిక సంఘం నాయకులు అదివారం తెలిపారు. గత 20 ఏళ్లుగా సౌదీలో వ్యవసాయ కూలీగా పని చేస్తూ గత 18 నెలల క్రితం స్వగ్రామానికి వచ్చి తిరిగి వెళ్లాడాని స్థానికులు తెలిపారు. మృతునికి వివాహ వయస్సున్న ఒక కూతురు, కుమారుడున్నారు. గత కొద్ది ఏళ్లుగా జీవానోపాధి కోసం సౌదీ వెళ్లిన రాగి రవి స్వగృహం లేని నిస్సహాయ స్థితిలో మృతి చెందడం బాధకరమని గల్ఫ్ కార్మికుడు బుర్ర తిరుపతి సంతాపం వ్యక్తం చేశారు. మృతుని కుటుంబానికి ప్రభుత్వం చేయూత అందించి అదూకోవాలని గల్ఫ్ కార్మిక సంఘాల నాయకులు, స్థానికులు విజ్ఞప్తి చేశారు.