అంతర్జాతీయ సెమినార్ కి ఎంపికైన హుస్నాబాద్ వాసి

A resident of Husnabad who was selected for the international seminarనవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
రాజస్థాన్ లో జరిగే ఇండియన్ పొలిటికల్ సైన్స్ అంతర్జాతీయ సెమినార్ కి  పొలిటికల్ సైన్స్ పరిశోధక విద్యార్థి హుస్నాబాద్ వాసి  కళ్లేపల్లి ప్రశాంత్ ఎంపికయ్యారు. 61వ ఆల్ ఇండియాపొలిటికల్ సైన్స్ కాన్ఫరెన్స్, అంతర్జాతీయ సెమినార్ రాజస్థాన్ రాష్ట్రంలోని బికనీర్ లో గల మహారాజా గంగా సింగ్ విశ్వవిద్యాలయంలో ఈ నెల 18, 19 తేదీలలో షెడ్యూల్ ఖరారు అయినట్లు ప్రశాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. విక్షిత్ భారత్ ఏ 2047 అంశం పై జరుగుతున్నా  అంతర్జాతీయ సదస్సులో  భారత దేశం లో ప్రజాస్వామ్య పోకడలు ప్రజల భాగస్వామ్యం  ప్రజాస్వామ్య సంస్థల పని తీరు భారత ప్రజాస్వామ్య స్థితిగతులు, మానవ హక్కులు, పత్రిక స్వేచ్ఛ, శాసన వ్యవస్థ పని తీరు ప్రజాస్వామ్య అసంతృప్తులు వివిధ వర్గాల రాజకీయ భాగస్వామ్యం అల్ప సంఖ్యాకులను రాజకీయాలకు దూరం చేయడం వంటి అనేక అంశాల మీద పరిశోధన పత్రాన్ని సమర్పించనున్నారు. గత పది సంవత్సరాల్లో  భారత రాజకీయ వ్యవస్థలో ప్రజాస్వామ్య సంస్థలు, రాజ్యాంగ వ్యవస్థలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాస్వామ్య పరిరక్షణలో వాటి పాత్రను విమర్శనాత్మకంగా వివరించడం జరిగిందని తెలిపారు. ప్రస్తుత ప్రజాస్వామ్య వ్యవస్థ స్థితి గతులను ప్రతిబింబించేలా ప్రశాంత్ పరిశోధన  ఉందని ప్రొఫెసర్ వి రాంచంద్రం ,రాజనీతి శాస్త్ర విభాగపు అధ్యాపకులు సహా పరిశోధకలు అభినందించినట్లు తెలిపారు.