నవతెలంగాణ – సారంగాపూర్
మండలంలోని చించోలి(బి) గ్రామ ఉన్నత పాఠశాలకు బుధవారం రిటైర్డ్ టీచర్ శ్రీ రామ్ చందర్ గౌడ్ మినరల్ వాటర్ ప్యూరిఫెయిడ్ మిషన్ ను విరాళంగా అందజేశారు. ఈ సందర్బంగా ఎంఈఓ మధుసూధన్ మాట్లాడుతూ.. విద్యార్థుల అవసరాల నిమిత్తము, రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని పిల్లలందరికీ శుద్ధ జలం అందించాలని దృఢ సంకల్పంతో సుమారు రూ.30 వేల విలువ గల వాటర్ ప్యూరిఫైయర్ ను గంటకు 50 లీటర్లు శుద్ధ నీటి నిచ్చే శుద్ధ జల యంత్రాన్ని పాఠశాలకు అందించడం ఆనందదాయకం అన్నారు. అనంతరం విరాళ దాత ను ఏంఈఓతోపాటు పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు కూన రమేష్ ,ఉపాధ్యాయ బృందం, వి.డి.సి ,గ్రామ ప్రజలు అభినందించారు.