వెనక్కి తగ్గిన ఉక్రెయిన్‌

కైవ్‌: ఉక్రెయిన్‌ సైన్యం తూర్పు నగరం చాసివ్‌ యార్‌ నుండి వెనక్కి తగ్గింది. ఆ ప్రాంతాన్ని తమ బలగాలు ఆధీనంలోకి తీసుకున్నాయని రష్యా ప్రకటించింది. తూర్పు డొనెట్స్క్‌ ప్రాంతంలోని చాసివ్‌ యార్‌లో కొంత భాగం నుండి తమ దళాలు వైదొలిగాయని ఉక్రెయిన్‌ సైన్యం గురువారం తెలిపింది. చాసివ్‌ యార్‌ ఎత్తైన ప్రదేశంలో ఉంది. రష్యన్‌ దళాలు పట్టణంపై పూర్తి నియంత్రణను ఏర్పరుచుకుంటే, ఉక్రెయిన్‌ నగరాలైన క్రామాటోర్స్క్‌, స్లోవియన్స్క్‌ వైపు పశ్చిమ దిశగా ముందుకు సాగడానికి వారు దానిని స్టేజింగ్‌ పోస్ట్‌గా ఉపయోగించుకోవచ్చు.