ఆ ‘పూర్వ’ విద్యార్థుల కలయిక

నవతెలంగాణ – డిచ్ పల్లి
డిచ్ పల్లి మండలంలోని మెంట్రాజ్ పల్లి గ్రామంలోని జిల్లాపరిషత్ హైస్కూల్ లో 1995-96 ఎస్సెస్సీ బ్యాచ్ విద్యార్థులు ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. మెంట్రాజ్ పల్లి గ్రామంలోని రైతువేదిక లో తమకు ఆనాడు చదువు నేర్పిన గురువులతో పూర్వ విద్యార్థులు కలిశారు. 28 ఏళ్ల తర్వాత మళ్లీ ఒకరికొకరు కలుసుకుని ఆత్మీయంగా ఆలింగనాలు చేసుకుని యోగా క్షేమాలను అడిగి తెలుసుకున్నారు.ఇన్ని ఏళ్ళ తర్వాత వారివారి కుటుంబసభ్యులు, పిల్లలను పరిచయం చేసుకుని పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఆనందంగా గడిపారు.అనంతరం గురువులను ఘనంగా సన్మానించారు. అందరూ కలిసి భోజనాలు చేసి స్నేహితులను వీడలేక భారమైన మనసులతో తిరిగి స్వగ్రామానికి వెళ్లారు.ఈ కార్యక్రమం లో బర్దిపూర్ సహకార సొసైటీ చైర్మన్ కొసరాజు రామకృష్ణ, ఉపాధ్యాయుడు జి చిన్నయ్య, లక్ష్మీనారాయణ,ఇక్రముల్లా, డి ఆర్ మోహన్, నరసింహమూర్తి, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.