సూర్య శ్రీనివాస్, శివ బొడ్డు రాజు, జెన్నిఫర్ ఇమ్మాన్యు యేల్ నాయకానాయికలుగా తేడా బ్యాచ్ సినిమా, నక్షత్ర ఫిలిం ల్యాబ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా EVOL. (LOVE) ని రివర్స్ లో చూస్తే EVOL. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్‌కి వస్తున్న అనూహ్య స్పందన నేపథ్యంలో ప్రొడ్యూసర్, డైరెక్టర్ రామ్ యోగి వెలగపూడి మాట్లాడుతూ, ‘ఇదొక రివర్స్ లవ్ స్టోరీ. ఇద్దరు స్నేహితులు మధ్య జరిగిన రహస్య ఒప్పందం ఏంటి? అనేదానితోపాటు ఈ కాలంలో జరుగుతున్న యదార్థ సంఘటనల ఆధారంగా బోల్డ్ సీన్స్‌తో అత్యంత సహజంగా సినిమాని రూపొందిస్తున్నాం. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటూ సినిమా పైన అందరిలోనూ ఆసక్తిని పెంచడం ఆనందంగా ఉంది’ అని తెలిపారు. ఈ చిత్రానికి మ్యూజిక్ : సునీల్ కశ్యప్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : వెల్లూరు మధుబాబు, కథ, స్క్రీన్ ప్లే, లిరిక్స్, నిర్మాత, దర్శకత్వం : రామ్ యోగి వెలగపూడి.