నవతెలంగాణ – నసురుల్లాబాద్
తెలంగాణ దశాబ్ది ఉస్తవాలలో భాగంగా 8న గురువారం నిర్వహించనున్న ఊరూరా చెరువుల పండుగను విజయవంతం చేయాలని బర్లుర్ ఎంపీడీఓ బానుప్రకాస్ తెలిపారు. బుధవారం మండలంలోని కిష్టాపూర్ గ్రామంలో ఉన్న ఊరు చెరువు కట్టాను పరిశీలించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రామంలో చెరువు కట్టపై బోనాల పండుగ వన భోజనం కావాల్సిన ఏర్పాట్లను పరిశీలించారు ఊరు చెరువుల కొండ కార్యక్రమంలో విజయవంతం చేయాలని ఎంపీడీవో సూచించారు. నసురుల్లాబాద్ మండలంలోని మిర్జాపూర్ గ్రామ పూర్వ చెరువులో గ్రామ సర్పంచ్ పురం వెంకట్ రమణ ఇరిగేషన్ అధికారులు పరిశీలించారు. ఉరురా చెరువుల పండగ సంబరాలకు కావలసిన ఏర్పాట్లపై సమీక్షించారు. అన్ని గ్రామాలలో కార్యక్రమం చేపట్టనున్న చెరువులను సందర్శించడం జరిగింది.
రేపు చేపట్ట బోయే పనులను అడిగి తెలుసుకొని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులు కోరారు ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ తో పాటు మండల తహశీల్దార్, గ్రామాల సర్పంచ్ లు, గ్రామ కార్యదర్శులు పాల్గొన్నారు