
నవతెలంగాణ- మద్నూర్
రాష్ట్ర ప్రభుత్వం అడ్డుదారికి అడ్డుకట్ట వేయలేకపోవడం రాష్ట్రానికి వచ్చే ఆదాయం కోల్పోయే దానిని కాపాడలేని పరిస్థితి కొనసాగుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి గండిపడే ఆదాయం కోల్పోతున్న దానిపట్ల ప్రత్యేక దృష్టి పెట్టకపోవడం ప్రతిరోజు వేలాది రూపాయలు మన రాష్ట్రానికి వచ్చే ఆదాయం పూర్తిగా దెబ్బతింటుంది. తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర సరిహద్దులోని మద్నూర్ మండలం సలాబత్పూర్ సమీపంలో మహారాష్ట్రకు పూర్తిగా బార్డర్లో అంతర్రాష్ట్ర ఆర్టీవో చెక్పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ చెక్ పోస్ట్ గుండా వెళ్లే వాహనాలకు ఆర్టీవో శాఖ అధికారులు ప్రత్యేకంగా తనిఖీలు చేపట్టి అధిక బరువు తరలించే వాహనాలకు టాక్స్ ల రూపంలో పన్ను ఆదాయం వసూలు చేస్తారు. అధిక బరువు గల వాహనాలు అడ్డుదారి గుండా రాత్రింబవళ్లు తేడా లేకుండా తరలి వెళ్లడం ఆర్టీవో శాఖ ద్వారా వచ్చే ఆదాయం పెద్ద ఎత్తున కోల్పోవలసి వస్తుంది. అడ్డుదారి కేరాఫ్ అడ్రస్ మద్నూర్ మండల కేంద్రం నుండి పెద్ద తడుగూరు రహదారి గుండా మహారాష్ట్ర లోకి ప్రవేశిస్తున్నాయి ఇతర రాష్ట్రాల నుండి తెలంగాణ లోకి ఇదే దారి గుండా రావడం అడ్డుదారి గుండా రాకపోకలు జరిపే వాహనాల ద్వారా మన రాష్ట్ర ఆదాయానికి గండి పడుతుంది ఆర్టీవో శాఖ నిబంధనలు పాటించని వాహనాలు అడ్డుదారుల గుండా తరలి వెళ్తున్నాయి. ఈ అడ్డు దారి అరికట్టకపోతే రోజు వారి ఆదాయం భారీ మొత్తంలో గండి పడుతుంది అడ్డుదారి అరికట్టాలంటే మద్నూర్ మండల కేంద్రంలో తడుగూర్ రోడ్డు వద్ద చెక్పోస్ట్ ఏర్పాటు చేయవలసింది ఇక్కడ చెక్పోస్ట్ ఏర్పాటు చేస్తే రోజుకు వేలాది రూపాయలు ఆదాయం వచ్చే ఆస్కారం ఉంటుందని మండల ప్రజలు ప్రభుత్వానికి కోరుతున్నారు మన రాష్ట్ర సరిహద్దు గుండా మహారాష్ట్ర బార్డర్ వరకు నాలుగు లైన్ల హైవే రోడ్డు పూర్తి అయినప్పటి నుండి పెద్ద పెద్ద బరువు తీసుకువెళ్లి వాహనాలు అడ్డుదారుల గుండా తరలిస్తున్నారు. ఆర్టీవో చెక్పోస్ట్ ను తప్పించి పెద్ద తడగూర్ రోడ్డు గుండా తెలంగాణ రాష్ట్రం నుండి మహారాష్ట్రకు అక్కడి నుండి తెలంగాణ ప్రాంతానికి ఈ అడ్డు దారి గుండా రాత్రింబవళ్లు పెద్ద సంఖ్యలో వాహనాలు తరలి వెళ్తున్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా అడ్డు దారి పట్ల ప్రత్యేక దృష్టి సాధించి ఆదాయం కోల్పోయే వాటి పట్ల చెక్పోస్ట్ ఏర్పాటు చేస్తే అడ్డుదారికి అడ్డుకట్ట వేసినట్లు కావడమే కాకుండా రాష్ట్ర ఆదాయం కోల్పోకుండా కాపాడ గలుగుతామని మండల ప్రజల్లో ఆవేదన వ్యక్తం అవుతుంది అధికారుల కండ్ల ముందర నుండి అడ్డుదారి గుండా తరలి వెళ్లే వాహనాలపట్ల సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోకపోవడం అడ్డుదారి అక్రమ రవాణా దారులకు అడ్డు అదుపు లేకుండా పోతుంది అడ్డుదారి నీ అరికట్టి రాష్ట్రదాయానికి లాభం చేకూరే విధంగా చర్యలు చేపట్టాలని మండల ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.