ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం

నవతెలంగాణ – ఆర్మూర్

మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి లో ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ప్రస్తుత పార్లమెంట్ఎన్నికలు-ప్రజాస్వామ్యం-భవిష్యత్ కార్యాచరణ అనే అంశంపై రౌండ్ టేబుల్  సమావేశం శనివారం నియోజకవర్గ కన్వీనర్ ముగా ప్రభాకర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణంలోని ఎస్సి, ఎస్టీ, బీసీ, మైనారిటీ ముస్లింలు, క్రిష్టియన్ కమ్యూనిటీ లకు చెందిన ముఖ్య నాయకులు హాజరై బీజేపీ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. గత పదేళ్ల బిజెపి ,బి ఆర్ యెస్  ప్రభుత్వ పాలనలో ప్రజాస్వామ్యం మనుగడకు ముప్పు వాటిలిందని పేర్కొన్నారు, భారత రాజ్యాంగాన్ని మారుస్తామని పదేపదే వ్యాఖ్యలు చేస్తున్న బీజేపీ ప్రభుత్వానికి ఈఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. రేపు జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో ప్రజాస్వామ్యవాదులను, అభ్యుదయవాదులను,అన్ని కుల సంఘాలను విద్యార్థి సంఘాలను వామపక్ష పార్టీల మద్దతు కూడగట్టి బిజెపి పార్టీని ప్రజాక్షేత్రంలో ఓడించడానికి కృషి చేస్తామని తెలిపారు రేపు జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి పూర్తి మద్దతు కాంగ్రెస్ పార్టీకే ఉంటుందని తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో అల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు షెట్పల్లి నారాయణ,సీపీఎం పార్టీ డివిజన్ అధ్యక్షుడు పల్లపు వెంకటేష్,,,టౌన్ అధ్యక్షుడు కుతడి ఎల్లయ్య,కుమ్మరి సంగం నేత లింబద్రి,అంసా అధ్యక్షుడు అంగరి ప్రదీప్,  జమతే ఇస్లామీ హిందు  అధ్యక్షుడు అస్లాం,అబ్దుల్లా, పాస్టర్ ప్రకాష్,సుధాకర్,మొచి సంగం సాయిరాం,తదితరులు పాల్గొన్నారు.