గ్రామీణ నేపథ్య కుటుంబ కథా చిత్రం

గ్రామీణ నేపథ్య కుటుంబ కథా చిత్రంప్రణం దేవరాజ్‌ ప్రధాన పాత్రధారిగా, శంకర్‌ దర్శకత్వంలో పి.హరికష్ణ గౌడ్‌ నిర్మాణంలో ఓ కంప్లీట్‌ ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌ రూపొందుతోంది. హరి క్రియేషన్స్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెం.1గా తెలుగు, కన్నడ భాషలలో ఏకకాలంలో తెరకెక్కనున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ఆకాష్‌ పూరి క్లాప్‌ కొట్టగా, దేవరాజ్‌ కెమెరా స్విచాన్‌ చేశారు. తనికెళ్ళ భరణి మేకర్స్‌కి స్క్రిప్ట్‌ అందించి, తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు శంకర్‌ మాట్లాడుతూ,’ఇది నా మొదటి సినిమా. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత హరి గౌడ్‌కి ధన్యవాదాలు. విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కంప్లీట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఇది. మొదటి షెడ్యుల్‌ జనవరి మూడో వారం నుంచి హైదరాబాద్‌, తర్వాత వైజాగ్‌ పరిసర ప్రాంతాల్లో నిర్విరామంగా జరుగుతుంది’ అని అన్నారు ‘ఇది తెలుగులో నాకు మూడో చిత్రం. మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైన్మెంట్‌ ఉన్న కథ. మంచి లవ్‌ స్టొరీ, యాక్షన్‌ ఉంది’ అని హీరో ప్రణం దేవరాజ్‌ చెప్పారు. ‘దర్శకుడు శంకర్‌ చాలా అద్భుతమైన కథని రాసుకున్నారు. హరి గౌడ్‌ మంచి అభిరుచి ఉన్న నిర్మాత. సినిమా తప్పకుండా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’ అని రవి శివతేజ అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ, ‘ఇది మా మొదటి ప్రొడక్షన్‌. మంచి కంటెంట్‌ ఉన్న కథతో సినిమా చేస్తున్నాం’ అని తెలిపారు.