నవతెలంగాణ -తిరుమలగిరి: నవంబర్ 30న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తుంగతుర్తి గడ్డపైన కాషాయ జెండాను ఎగురవేయడానికి ముందుకు రావాలని బీజేపీ అభ్యర్థి తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి కడియం రామచంద్రయ్య అన్నారు. మంగళవారం నాగారం మండల కేంద్రం తో పాటు వర్థమానుకోట గ్రామంలో జరిగిన బిజెపి ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రజల ఉద్దేశించి ప్రసంగించారు. తుంగతుర్తి నియోజకవర్గం లో ఇసుక మాఫియా భూదందా దాడులు. అవినీతికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో స్వచ్ఛమైన పాలన అందించేందుకు తాను ముందుకు వచ్చానని ఆయన అన్నారు. 9 సంవత్సరాల బిఆర్ఎస్ పాలన లో నియోజకవర్గంలో అవినీతి అక్రమాలతో పాటు ప్రశ్నించిన వారిపై దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆయన ఆరోపించారు ఇప్పటికే నియోజకవర్గంలో బిక్కేరు వాగు నుండి ప్రతిరోజు వందలాది లారీలలో ఇసుకను తరలిస్తున్నా వాటిని అడ్డుకోవడంలో స్థానిక శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్ పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. పరోక్షంగా ఇసుక మాఫియాకు సహకరిస్తూ రైతుల జీవితాలతో చెలగాటమాడుతూ కోట్లాది రూపాయల ఆస్తులను సంపాదించారని అని చెప్పారు. నియోజకవర్గం లో బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై దాడులు చేస్తూ హత్య చేస్తామని బేదిరిస్తున్నారని అని చెప్పారు. గతంలో సంకినేని ఎమ్మెల్యేగా ఉన్న కాలంలోనే తుంగతుర్తి నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. బిజెపి పాలనలోనే ప్రజలకు సుఖశాంతులు ఉంటాయని చెప్పారు. నియోజకవర్గంలో తిరుమలగిరి మండలాన్ని దళిత బందు పథకం కింద పైలెట్ ప్రాజెక్టుగా ప్రకటించిన దళితులకు దక్కింది సగమేనని ఆయన అన్నారు. నియోజకవర్గం లోని అన్ని మండలాలకు దళిత బంధు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే బీసీ. మైనార్టీ బందు పేరుతో బీసీ ఓట్లను ఆకర్షించేందుకు తూతూ మంత్రంగా ఒకరో ఇద్దరికో చెక్కులను ఇచ్చారని అని చెప్పారు. గృహ లక్ష్మి పథకం అమలులో పూర్తిగా బిఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు. తనకు ఓటేసి గెలిపిస్తే నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని అని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారనీ అన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి రాగానే దళితుడి ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి మూడేకరాల భూమి ఇస్తామన్నారు, ఇంతవరకు వాటిని అమలు చేయడం లేదని ఆయన ఆరోపింారు. బిఆర్ఎస్ పార్టీ తొమ్మిది సంవత్సరాల పాలనలో రాష్ట్రంలో ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదని చెప్పారు. ఉద్యోగాలన్నీ లీకేజీ ల పేరుతో వాయిదా వేశారని ఆయన చెప్పారు.తుంగతుర్తి నియోజకవర్గం లో అవినీతి అరాచక పాలన కొనసాగుతుందని ఆయన చెప్పారు . నియోజకవర్గంలో డబల్ బెడ్ రూమ్ లు ఇంతవరకు కూడా ఎవరికి ఇవ్వలేదని అని చెప్పారు. నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే తనకు ఓటేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెవైఎం జిల్లా నాయకులు కడియం కళ్యాణ్ చందర్, నాగారం మండల శాఖ అధ్యక్షులు మొల్కపురి చిరంజీవి ,నర్సింగ్ వెంకన్న, మహేందర్, కొమురెల్లి, సోమేష్, రమేష్, కిరణ్, సైదులు.తదితరులు పాల్గొన్నారు.