సేవ కార్యక్రమాల ద్వారా దూసుకెళ్తున్న సేవ్ లైఫ్ ఫౌండేషన్

నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణ కేంద్రంలో గల సేవ్ లైఫ్ ఫౌండేషన్ సేవా కార్యక్రమాలలో తన వంతు బాధ్యత పోషిస్తుంది .నిత్యం అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ పేదల ఆకలి తీర్చడమే కాకుండా పేద ప్రజలకు అభాగ్యులకు నూతన వస్త్రాలను పంచి పెడుతూ ఒకపక్క తన దాతృత్వాన్ని చాటుతూ ఆర్మూర్ ప్రజల మండలాలను పొందుతుంది .వీటితోపాటు చదువుపై ఆసక్తి ఉండే పేద మధ్యతరగతి విద్యార్థిని విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలను అందించడం జరుగుతుంది .ఫౌండేషన్ ప్రతినిధులు ప్రభాస్ దినేష్ లు మాట్లాడుతూ సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతూ ఉంటాయని మా ఫౌండేషన్ ద్వారా ఏదైనా సేవా కార్యక్రమాలు చేయాలనుకునేవారు 8341 321 438 నెంబర్ కు సంప్రదించాలని సూచించారు.