ఆద్యంతం భయపెట్టే సినిమా

డేవిడ్‌ గోర్డాన్‌ గ్రీన్‌ దర్శకత్వం వహించిన అతీంద్రియ భయానక చిత్రం ‘ది ఎక్సార్సిస్ట్‌: బిలీవర్‌’. ఇది ‘ఎక్సార్సిస్ట్‌..’ ఫ్రాంచైజీలో ఆరవది. అలాగే ఇది ‘ది ఎక్సార్సిస్ట్‌’కి సీక్వెల్‌ కూడా. విలియం పీటర్‌ రాసిన ‘ది సమె నేమ్‌’ నవల ఆధారంగా దీన్ని తెరకెక్కించారు. 1973లో రిలీజైన ‘ది ఎక్సార్సిస్ట్‌’ సూపర్‌ నేచురల్‌ హర్రర్‌ చిత్రంగా ప్రేక్షకుల్ని విశేషంగా భయపెట్టింది. అంతేకాదు వరల్డ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ వసూళ్ళని కూడా కలెక్ట్‌ చేసింది. అలాగే 10 అకాడమీ నామినేషన్లు నామినేట్‌ చేయబడిన మొదటి భయానక చిత్రంగానూ ఇది నిలిచింది. ఒక రోజు ఏంజెలా, ఆమె సహచరురాలు కేథరీన్‌ (ఒలివియా ఓనీల్‌) తప్పి పోతారు. మూడు రోజుల తర్వాత ఏమి జరిగిందనే దానిపై ఎలాంటి క్లూ ఉండదు. క్రిస్‌ మాక్‌నీల్‌ (ఎల్లెన్‌)ని సంప్రదించమని విక్టర్‌ని బలవంతం చేస్తుంది. ఆ తరువాత ఏమి జరిగింది అనేది కథ. ఈ సినిమా విడుదలైన 50 సంవత్సరాల తర్వాత దీనికి సీక్వెల్‌గా రూపొందిన ”ది ఎక్సార్సిస్ట్‌: బిలీవర్‌’ అక్టోబర్‌ 6న తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో విడుదల కానుంది. దీనికి సినిమాటోగ్రఫీ-మైఖేల్‌ సిమండ్స్‌, సంగీతం- డేవిడ్‌ వింగో.