బాబాపూర్ కి చెందిన లిటిల్ ఫ్లవర్ స్కూల్ బస్సులో ఉన్న పిల్లలను గొన్ గొప్పులలో దించి తిరిగి భీంగల్ కి ఖాళీ బస్ వెళుతుండగా.. బస్ బడా భీంగల్ గ్రామ శివారులోని రైస్ మిల్ వద్దకు రాగానే బస్సును నడుపుతున్న జావీద్ అను డ్రైవర్ బస్సును అతివేగంగా, అజాగ్రత్తగా నడుపుతూ.. గోన్ గోపుల గ్రామానికి వెళ్తున్న బైక్ కి ఢీకొట్టింది. బైక్ పై ఉన్న కెలావత్ రాజు, విఠల్ ఇద్దరు వ్యక్తులకు బలమైన రక్త గాయాలయ్యాయి. ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసి ఎస్సై మహేష్ దర్యాప్తు చేపట్టనైనది.