
– చెట్ల నరికివేతలో నా ప్రేమేయం ఏమి లేదు.. పాఠశాల హెచ్ఎం
– చెట్ల నరికివేత పట్ల గ్రామ కార్యదర్శి వివరణ కోసం నవతెలంగాణ ఫోన్ చేయగా స్వీకరించని కార్యదర్శి
– ఎన్ఆర్ఈజీఎస్ నిధుల కింద రూ.16 లక్షల 50 వేల మంజూరు
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని పెద్ద షాక్కర్గ గ్రామంలో గల పాఠశాల స్థలం కబ్జా కోరల్లోకి వెళ్లినట్లు ఆ గ్రామస్తులు వ్యతిరేకత రావడం పాఠశాల కు కాంపౌండ్ వాల్ నిర్మాణం కోసం ఎన్ఆర్ఈజీఎస్ నిధుల కింద రూ.16 లక్షల 50 వేల రూపాయలు మంజూరు కాగా, ఆ నిధులతో పాఠశాలకు కాంపౌండ్ వాల్ నిర్మాణం ప్రారంభించగా గ్రామస్తులు వ్యతిరేకత వచ్చినట్లు కాంపౌండ్ వాల్ నిర్మాణం పనులు నిలిచిపోయాయి. ఈ పాఠశాల సమస్య పట్ల నవ తెలంగాణ బుధవారం నాడు పెద్ద షక్కర్గా పాఠశాలను సందర్శించగా, ఆ పాఠశాల సమస్య క్రిటికల్ గా వెళ్లడైంది ఆ పాఠశాల ఆవరణంలో గత ప్రభుత్వాలయంలో పల్లె ప్రకృతి వన కేంద్రం ఏర్పాటు చేసి మొక్కలు నాటడం జరిగింది. పాఠశాల కాంపౌండ్ వాల్ నిర్మాణం లో భాగంగా పల్లె ప్రకృతి వన కేంద్రానికి చెందిన చెట్లను నరికివేతకు గురి అయింది. పల్లె ప్రకృతి వన కేంద్రానికి చెందిన చెట్ల నరికివేత గురించి ఆ పాఠశాల హెచ్ఎం మారుతి సారును కలిసి అడిగి తెలుసుకోగా, చెట్ల నరికివేతలో నా ప్రమేయం ఏమీ లేదని సమాధానం ఇచ్చారు. చెట్ల నరికివేత గురించి ఆ గ్రామ కార్యదర్శికి నవ తెలంగాణ ఫోన్ ద్వారా వివరణ కోరెందుకు ప్రయత్నించగా ఫోన్ కాల్ ను స్వీకరించకపోవడం గమనారం. పాఠశాలకు మొత్తం రెండు ఎకరాల 10 గుంటల భూమి ఉన్నట్లుగా రెవిన్యూ అధికారులు తెలుపుతున్నట్లు ఆ పాఠశాల హెచ్ఎం తెలిపారు. పాఠశాలకు చెందిన రెండు ఎకరాల 10 గుంటల భూమి రికార్డులు పాఠశాలలో లేవని హెచ్ఎం తెలిపారు. పాఠశాలకు సంబంధించిన భూమిని ప్రభుత్వపరంగా సర్వే చేస్తే చుట్టుపక్కల ఏర్పాటుచేసిన అంగన్వాడి స్థలం అలాగే రైతు వేదిక ఇతరత్రా కొన్ని రకాల కుల సంఘాలకు చెందిన స్థలాలు ఉండటం ఈ పాఠశాల కాంపౌండ్ వాల్ నిర్మాణంలో అన్ని రకాల సమస్యలు ముందుకు రావడం గ్రామస్తులు లోనే వ్యతిరేకత ఏర్పడడం ప్రభుత్వ పరంగా మంజూరైన పాఠశాల కాంపౌండ్ వాల్ నిధులు వెనక్కి వెళ్లే ఆస్కారం ఉన్నట్లు పాఠశాల హెచ్ఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పాఠశాల కాంపౌండ్ వాల్ నిర్మాణంలో పలు రకాల వ్యతిరేకతలు వెల్లడవుతున్నాయి. ఏది ఏమైనా పాఠశాల కాంపౌండ్ వాల్ నిర్మాణం ఒకపక్క నిలిచిపోగా మరోపక్క పల్లె ప్రకృతి వన కేంద్రానికి చెందిన చెట్లను నరకడం చెట్ల నరికివేత పట్ల ఎవరి ఆదేశాలు ఉన్నాయో తెలియని పరిస్థితి. ఇలాంటి క్రిటికల్ వెనకాల గొయ్యి ముంగట గుయ్యి అన్న చందంగా ఈ పాఠశాల నిధులు వెనక్కి వెళ్లే విధంగా కనిపిస్తున్నాయి. ఈ మార్చ్ లోపే నిధులు ఖర్చు పెట్టవలసి ఉంటుందని లేనియెడల మంజూరైన నిధులు లాప్స్ అయ్యే ఆస్కారం ఉంటుందని పాఠశాల హెచ్ఎం ఆవేదన ద్వారా తెలుస్తోంది. గ్రామస్తులంతా కలిసి పాఠశాల సమస్య వెంటనే పరిష్కరింప చేస్తే భారీ మొత్తంలో మంజూరైన నిధులు పాఠశాలకు ఉపయోగపడతాయని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఈ పాఠశాల సమస్య ఉన్నతాధికారులు స్పందించవలసిన అవసరం ఎంతైనా ఉంది.