నవతెలంగాణ-ఓయూ
కర్నాటక కొడగు జిల్లా మకు టాలో ఒక భూగర్భ గుహ నుంచి మినియోపెట్రస్ శ్రీని, శ్రీనిస్ బెంట్-వింగ్డ్ బ్యాట్ అనే కొత్త జాతి గబ్బి లంను ఇటీవలే కనుగొన్నారు. ఓయూ శాస్త్రవేత్త డాక్టర్ భార్గవి శ్రీని వాసులు, యూనివర్సిటీ అఫ్ రీడింగ్, యునైటెడ్ కింగ్డమ్‌కి చెందిన పీహె చ్‌డీ రీసెర్చ్ స్కాలర్ ఆదిత్య శ్రీనివా సులు ఈ గబ్బిలాన్ని అనేక ఆధారాలను వివరించారు. ”వేం మకుటాలోని పశ్చిమ కనుమల్లోని దట్టమైన అరణ్యా ల్లోని పెద్ద భూగర్భ గుహ నుంచి గబ్బిలాల నమూనాలను సేకరించాం. ఇది చిన్న బెంట్-వింగ్డ్ బ్యాట్ అని మేం తాత్కాలికంగా గుర్తించాం. ఈ గబ్బిలం నికోబార్ దీవులు, దక్షిణ భారతదేశం, నేపాల్, ఈశాన్య భారతదేశంలో కనిపి స్తుంది. అండమాన్ గబ్బిలాలపై మా పరిశోధనలో దీవు ల్లోని జంతుజాలం భారతదేశంలోని ప్రధాన భూభాగంలో ఉన్న వాటి కంటే జన్యుపరంగా భిన్నంగా ఉందని వెల్ల డించింది. పశ్చిమ కనుమల్లోని ఇతర ప్రాంతాల నుంచి నివేదించబడిన మకుట నమూనాలు, ఇతరాలు రహస్య జాతులు కావచ్చని మేం అనుమానించాం. మకుట నమూనాలు, ఇతరుల మధ్య సంబంధాన్ని గుర్తించడానికి మేం వర్గీకరణ అధ్యయనాలు, ఎకోలొకేషన్, జన్యు అధ్య యనాలను నిర్వహించాం” అని ఓయూలోని జువాలజీ విభాగంలో యూజీసీ – పోస్ట్ డాక్టోరల్ ఫెలో డాక్టర్ భార్గవి శ్రీనివాసులు వెల్లడించారు. బెంట్-వింగ్డ్ గబ్బి లాలు చిన్న గబ్బిలాలు, ఇవి గుహల్లో కొన్ని వందల సంఖ్య లో పెద్ద కాలనీల్లో నివసిస్తాయి. అవి వాటి శరీరం కంటే 2.5 రెట్లు పొడవుగా ఉండే పొడవైన రెక్కలను కలిగి ఉంటాయి. వాటి రెక్కలు శరీరంపై ముడుచుకుంటాయి, అందుకే వాటిని బెంట్-వింగ్డ్ బ్యాట్ అంటారు. ఇవి దక్షిణ ఐరోపా, ఆఫ్రికా, మడగాస్కర్, ఆసియా, ఆస్ట్రేలియా, న్యూ కాలెడోనియా వనాటుల్లో కనిపి స్తాయి. భారతదేశంలో ఈ గబ్బిలాల్లో నాలుగు జాతులు ఉన్నాయి. కొత్త జాతిని కనుగొనడంతో వాటి సంఖ్య ఐదుకు పెరిగిందన్నారు. ‘పశ్చిమ కను ముల్లో రెండు రకాల బెంట్-విన్గ్ద్ గబ్బిలాలు దొరుకుతాయి. మా పరిశో ధన ద్వారా మేం ఈ రెండింటిలో ఒకటి కొత్త రకమైన జాతి అని కనుగున్నాం. ఈ జాతి శరీర రచనలో ఇంతక ముందు తెలిసిఉన్న జాతులతో ఒకే మాదిరిగా ఉన్నప్ప టికీ ఇవి జన్యుపరంగా భిన్నంగా ఉన్నాయి. పశ్చిమ కనుమల్లోని ఇతర ప్రాంతాల నుంచి చిన్న బెంట్-వింగ్డ్ గబ్బిలాలుగా నివేదించబడిన నమూనాలు ఇప్పుడు శ్రీనిస్ బెంట్-వింగ్డ్ గబ్బిలాలకు కేటాయించబడ్డాయి. నేపాల్, ఈశాన్య భారతదేశాల బెంట్-వింగ్డ్ గబ్బిలాల వర్గీకరణ స్థితిని నిర్ధారించాల్సిన అవసరం ఉంది” అని యూకేలోని యూనివర్శిటీ ఆఫ్ రీడింగ్‌లో పీహెచ్‌డీ పరిశోధకుడు ఆదిత్య శ్రీనివాసులు పేర్కొన్నారు. వ్యవసాయం, అటవీ, పట్టణ పర్యావరణ వ్యవస్థల్లో కీటకాల జనాభాను నియంత్రిస్తుంది కాబట్టి కీటకాలు తినే గబ్బిలాలు పర్యావరణపరంగా ముఖ్యమైనవి. ఆర్థిక వ్యవస్థకు వాటి సహకారం ఎంతో ఉంది. అవి పర్యావరణ వ్యవస్థలో ముఖ్యమైన భాగం. ఓయూలో పని చేస్తున్న ప్రఖ్యాత గబ్బిలాల శాస్త్రవేత్త ప్రొ.సి.శ్రీనివాసులు గౌరవార్థం ఈ కొత్త జాతికి పేరు పెట్టారు. ఈ కొత్త జాతి వివరణ జూటాక్సా జంతు వర్గీకరణ శాస్త్రవేత్తల కోసం పీర్-రివ్యూడ్ సైంటిఫిక్ మెగా జర్నల్ తాజా సంచికలో ప్రచురించడిన విషయం తెల్సిందే.