సీట్‌ ఎడ్జ్‌ థ్రిల్లర్‌

A seat edge thrillerరాహుల్‌ విజరు, శివాని రాజశేఖర్‌ లీడ్‌ రోల్స్‌లో దర్శకుడు తేజ మార్ని తెరకెక్కించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్‌’. శ్రీకాంత్‌, వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ కీలకపాత్రలు పోషించారు. గీతా ఆర్ట్స్‌ 2 బ్యానర్‌పై బన్నీ వాస్‌, విద్యా కొప్పినీడి నిర్మించారు. ఈనెల 24న సినిమా విడుదలవుతున్న సందర్భంగా రాహుల్‌ విజరు మీడియాతో మాట్లాడుతూ, ‘మంచి కథ కోసం చూస్తున్న సమయంలో గీతా ఆర్ట్స్‌ నుంచి కాల్‌ రావడం ఆశ్చర్యపోయాను. ‘నాయట్టు’ చిత్రంలో నుంచి పాయింట్‌ మాత్రమే తీసుకొని మిగతాదంతా తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేశారు. శ్రీకాకుళంలో ఉన్న కోటబొమ్మాళి ఊరిలో ఉన్న పోలీస్‌ స్టేషన్లో ఏం జరిగిందనేది మెయిన్‌ కాన్సెప్ట్‌. కానిస్టేబుల్‌ రవి పాత్రలో నటించాను. ఎస్‌ఐ రామకష్ణగా శ్రీకాంత్‌ కనిపిస్తారు. దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితులను ఇందులో చూడొచ్చు. తేజ మార్ని క్లారిటీ ఉన్న దర్శకుడు. స్క్రీన్‌ ప్లే రేసీగా, సీట్‌ ఎడ్జ్‌ థ్రిల్లర్‌గా ఉంటుంది. చివరి అరగంట చాలా ఎమోషనల్‌గా కూడా ఉంటుంది. వరలక్ష్మి శరత్‌ కుమార్‌ సెట్‌లో చాలా చిల్‌గా ఉంటారు. ఆమె చాలా ఇంటెన్స్‌ పెర్ఫార్మర్‌. ‘లింగిడి లింగిడి..’ సాంగ్‌కు ఇంత హ్యుజ్‌ రెస్పాన్స్‌ వస్తుందని ఊహించలేదు. ఈ పాట వల్లే సినిమాకు మరింత బజ్‌ వచ్చింది. యూనిక్‌ పాయింట్‌తో బ్యూటిఫుల్‌ ఎమోషన్స్‌తో రాబోతున్న ఈ చిత్రం ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. గీతా ఆర్ట్స్‌ సంస్థలో నాన్న (విజరు) అసిస్టెంట్‌ ఫైటర్‌గా, ఫైట్‌ మాస్టర్‌గా వర్క్‌ చేశారు. అదే సంస్థలో నేను హీరోగా చేయడాన్ని ఆయన హ్యాపీగా ఫీలయ్యారు. నాకు కూడా ఇది గ్రేట్‌ ఎక్స్పీరియన్స్‌. ఈ సినిమా నా కెరియర్‌కు చాలా ప్లస్‌ అవుతుంది. లీడ్‌ గానే కాకుండా మంచి పాత్ర దొరికితే ఎలాంటి క్యారెక్టర్‌ చేయడానికి అయినా సిద్ధంగా ఉన్నా. ప్రస్తుతం ఆర్కా సంస్థలో ఒక రియాల్టి షో చేస్తున్నా’ అని చెప్పారు.