ప్రేక్షకులను మెప్పించే అన్వేషి

A seeker of crowd pleasersవిజయ్‌ ధరణ్‌, సిమ్రాన్‌ గుప్తా, అనన్యా నాగళ్ల హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘అన్వేషి’. అరుణ శ్రీ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై వీజే ఖన్నా దర్శకత్వంలో టి.గణపతి రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా నేడు (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా హీరో విజయ్‌ ధరణ్‌ మీడియాతో మాట్లాడుతూ, ‘డైరెక్టర్‌ విజరు ఖన్నా ఆడిషన్స్‌కు పిలవడంతో ఈ మూవీ జర్నీ స్టార్ట్‌ అయింది. కథ విన్న తరువాత బెస్ట్‌ ఫిల్మ్‌ అవుతుందని అనిపించింది. కథలో కొత్త ఎలిమెంట్స్‌ ఉన్నాయి. ఫ్రెష్‌గా ఉన్నాయి. లవ్‌స్టోరీతో స్టార్ట్‌ అవుతుంది. హర్రర్‌ మిక్స్‌ ఉంటుంది. లవ్‌ థ్రిల్లర్‌గా అని చెప్పొచ్చు. మారేడు కోన గ్రామంలో దారి సమస్య ఉంటుంది. దీనికి మెయిన్‌ రీజన్‌.. ఆసుపత్రిలో అను మానాస్పద ఘటనలు జరుగు తుంటాయి. ఇవి ఎందుకు జరుగుతుంటాయి?, డిటెక్టివ్‌ అవుదామనుకున్న కుర్రాడు అక్కడికి ఎలా వచ్చాడు? ఆ సమస్యలను ఎలా పరిష్కరించాడు? అనేది కథ. ఓ ఆత్మ వల్ల జరిగిన సంఘ టనల కారణంగా సినిమాలో ఇన్వెస్టిగేషన్‌ ప్రారంభం అవుతుంది. కంప్లీట్‌గా విలేజ్‌ రూరల్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంది. మిస్టరీ అంతా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. అనన్య నాగళ్ల పాత్రలో జీవించింది. చాలా బాగా నటించింది. అయితే కథ అంతా అమ్మాయి చూట్టే ఉంటుంది. అనన్యది చాలా ఇంపార్టెంట్‌ రోల్‌. సినిమాలో నా పెయిర్‌ మాత్రం సిమ్రాన్‌ గుప్తాతో ఉంటుంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ పాత్రను నాగిణి చేశారు. ‘నువ్వే నువ్వే’ మూవీలో తరుణ్‌-సునీల్‌ తరహాలో అలాంటి కాంబినేషన్‌ రిపీట్‌ అయిందని డైరెక్టర్‌ చెప్పారు. కొంత మందికి షోలు వేసి చూపించాం. అందరూ కథ చాలా ఫ్రెష్‌గా ఉందన్నారు. సినిమా ఆడకపోతే గుండు కొట్టించుకుంటా అని చెప్పా. ఎందుకంటే నేను సినిమాపై నమ్మకంతో ఉన్నాను. అందుకే ఆ స్టేట్‌మెంట్‌ ఇచ్చా. ఈ ప్రొడక్షన్‌లోనే ఇంకో సినిమా ఉంటుంది. ‘అన్వేషి-2′ కూడా రాబోతుంది’ అని అన్నారు.